మహేష్ కెరీర్ బెస్ట్ వరల్డ్ వైడ్ షేర్ సాధించాడు.

మహేష్ కెరీర్ బెస్ట్ వరల్డ్ వైడ్ షేర్ సాధించాడు.

Published on Jan 19, 2020 11:59 AM IST

సరిలేరు నీకెవ్వరు మహేష్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో విశేష ఆదరణ దక్కించుకుంటుంది. పండుగ సీజన్ కి వచ్చిన పర్ఫెక్ట్ మూవీగా సరిలేరు నీకెవ్వరు నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా సరిలేరు నీకెవ్వరు వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. నైజాం లో సరిలేరు నీకెవ్వరు 8 రోజులకు రూ. 29.8 కోట్ల షేర్ రాబట్టింది. ఈ చిత్రం మహేష్ కెరీర్ లో హైయెస్ట్ నైజాం కలెక్షన్స్ సాధించిన మహర్షి మూవీని దాటివేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక యూఎస్ లో $2 మిలియన్ వసూళ్లకు చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా సరిలేరు నీకెవ్వరు ఎనిమిది రోజులకు షేర్ రూ.112.03 కోట్లకు చేరింది.

సీడెడ్ లో రూ. 13.25 కోట్లు, గుంటూరులో రూ. 8.51 కోట్లు, కృష్ణ రూ.7.34 కోట్ల షేర్ వసూలు చేసింది. చాలా ఏరియాలలో సరిలేరు నీకెవ్వరు బ్రేక్ ఈవెన్ కి చేరుకుంది. దర్శకుడు అనిల్ రావిపూడి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈచిత్రాన్ని తెరకెక్కించారు. రష్మిక మందాన హీరోయిన్ గా నటించగా దిల్ రాజు సమర్పణలో రామ బ్రహ్మం సుంకర నిర్మించారు. దేవిశ్రీ సంగీతం అందించారు.

ప్రాంతాల వారీగా 8 రోజులకు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వివరాలు…
నైజాం – 29.8 కోట్లు
సీడెడ్ – 13.25 కోట్లు
ఉత్తరాంధ్ర – 14.9 కోట్లు
గుంటూరు – 8.51 కోట్లు
ఈస్ట్ – 9.04 కోట్లు
వెస్ట్ – 6.02 కోట్లు
కృష్ణ – 7.34 కోట్లు
నెల్లూరు – 3.32 కోట్లు
కర్ణాటక – 7.0 కోట్లు
తమిళనాడు – 1.0 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 1.5 కోట్లు
యూఎస్ – 7.85 కోట్లు
రెస్ట్ ఆఫ్ వరల్డ్ – 2.5 కోట్లు

మొత్తం 8 రోజులకు వరల్డ్ వైడ్ షేర్ – రూ. 112.03 కోట్లు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు