‘సరైనోడు’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ రిపోర్ట్!

‘సరైనోడు’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ రిపోర్ట్!

Published on Apr 29, 2016 12:50 PM IST

sarrinodu
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అంతా ఊహించినట్లుగానే ‘సరైనోడు’తో ప్రేక్షకులకు ముందుకు వచ్చేసి మంచి కలెక్షన్స్ సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా నిలబడ్డాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ ఎంటర్‌టైనర్‌కు టార్గెట్ ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. వేసవి సెలవులు కావడం, ఈ సినిమాకు మొదట్నుంచీ మంచి క్రేజ్ ఉండడం.. ఇలా అన్ని అంశాలూ కలుపుకొని ‘సరైనోడు’ సినిమా మొదటి వారం 45.72 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది.

నైజాం, ఆంధ్ర, సీడెడ్, కర్ణాటక.. ఇలా అన్ని ప్రాంతాల్లోనూ ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఒక్క నైజాంలోనే మొదటి వారం 11.36 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించి ‘సరైనోడు’ పేరు నిలబెట్టుకున్నాడు. ఇక ప్రాంతాల వారీగా మొదటి వారం కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి..

ఏరియా
కలెక్షన్స్ (షేర్)
నైజాం 11.36 కోట్లు
సీడెడ్ 6.80 కోట్లు
కృష్ణా 2.28 కోట్లు
గుంటూరు 3.24 కోట్లు
నెల్లూరు 1.36 కోట్లు
తూర్పు గోదావరి 2.90 కోట్లు
పశ్చిమ గోదావరి 2.60 కోట్లు
వైజాగ్ 4.43 కోట్లు
కర్ణాటక 5.96 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.09 కోట్లు
ఓవర్సీస్ 3.70 కోట్లు
మొత్తం 45.72 కోట్లు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు