సునీల్ స్థానంలో సత్యదేవ్ !

సునీల్ స్థానంలో సత్యదేవ్ !

Published on Dec 14, 2017 1:56 PM IST

సునీల్ నటించిన తాజా సినిమా ‘టూ కంట్రీస్‌’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దర్శకుడు ఎన్‌.శంకర్‌ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. సునీల్ 2014లో తమిళంలో విడుదలై హిట్ చిత్రంగా నిలిచిన ‘శతురంగ వెట్టై’ రీమేక్ లో నట్టిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

తాజా సమాచారం మేరకు ఈ రీమేక్ లో సునీల్ నటించడం లేదని తెలుస్తోంది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘జ్యోతిలక్ష్మి’ సినిమాలో నటించిన సత్య దేవ్ ఈ సినిమాలో నటించబోతున్నాడు. త్వరలో ఈ సినిమా ప్రారంభం కానుంది. గతంలో ‘రోమియో’ సినిమాకు దర్శకత్వం వహించిన గోపి గణేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. శ్రీదేవి మూవీస్ ఈ సినిమాను నిర్మించబోతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు