హిందీలో భారీ ప్రాజెక్ట్ కొట్టేసిన సయామీ ఖేర్

హిందీలో భారీ ప్రాజెక్ట్ కొట్టేసిన సయామీ ఖేర్

Published on Apr 23, 2014 2:06 PM IST

Saiyami_Kher
ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్న ట్రెండ్ ప్రకారం ఒక న్యూ హీరోయిన్ కి సెకండ్ సినిమా ఆఫర్ రావాలి అంటే ఫస్ట్ సినిమా సక్సెస్ కావాలి. అలా కాకుండా ఫస్ట్ సినిమా రిలీజ్ కి ముందే మరో పెద్ద ఆఫర్ వచ్చింది అంటే చాలా అదృష్టవంతురాలనే చెప్పాలి. అలాంటి లక్ ‘రేయ్’ సినిమాతో తెలుగు వారికి పరిచయం కానున్న సయామీ ఖేర్ కి దక్కింది.

తాజా సమాచారం ప్రకారం సయామీకి బాలీవుడ్ లో ఒక బంపర్ ఆఫర్ వచ్చింది. ‘భాగ్ మిల్కా భాగ్’ లాంటి సూపర్ హిట్ అందించిన రాకేశ్ ఓంప్రకాష్ మెహ్రా తదుపరి చేయనున్న సినిమాలో సయామీ ఖేర్ హీరోయిన్ గా నటించనుంది. ఈ సినిమా ద్వారా అనిల్ కపూర్ కుమారుడు హర్షవర్ధన్ కపూర్ హీరోగా పరిచయం కానున్నాడు.

సాయి ధరమ్ తేజ్ హీరోగా పరిచయమవుతూ సయామీ ఖేర్ హీరోయిన్ గా నటించిన ‘రేయ్’ సినిమా మే 9న రిలీజ్ కానుంది. శ్రద్ధ దాస్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన ఈ సినిమాకి వైవిఎస్ చౌదరి దర్శకనిర్మాత.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు