‘ఆగడు’కి కంటిన్యూగా డబ్బింగ్ చెబుతున్న మహేష్ బాబు

‘ఆగడు’కి కంటిన్యూగా డబ్బింగ్ చెబుతున్న మహేష్ బాబు

Published on Sep 3, 2014 8:57 AM IST

Mahesh-Babu-Aagadu-Movie

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆగడు’. ఆగష్టు 30న మహేష్ బాబు ఈ సినిమాకి డబ్బింగ్ మొదలు పెట్టాడని తెలియజేశాం. అదే రోజు జరిగిన ఆడియో రిలీజ్ తర్వాత ఓ రోజు గ్యాప్ తీసుకున్న మహేష్ బాబు గత రెండు రోజుల నుంచి కంటిన్యూగా డబ్బింగ్ చెబుతున్నారు. మహేష్ తో పాటు డైరెక్టర్ శ్రీనువైట్ల కూడా దగ్గరుండి మహేష్ బాబు డబ్బింగ్ పనులు చూసుకుంటున్నాడు.

మహేష్ బాబు ఈ సినిమాలో రాయలసీమ స్లాంగ్ లో మాట్లాడనున్నారు. అందుకే డబ్బింగ్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. మహేష్ బాబు కంటే ముందే ఈ సినిమాలో నటించిన కీలక నటీనటులు తమ పార్ట్ కి డబ్బింగ్ చెప్పారు. ఇటీవలే ఈ చిత్ర టీం మిగిలి ఉన్న రెండు పాటలని యూరప్ లో ఫినిష్ చేసుకొని ఇటీవలే ఇండియాకి తిరిగివచ్చారు.

ఎస్ఎస్ తమన్ అందిచిన ఆడియోకి మంచి రెస్పాన్స్ వస్తుంది. మహేష్ బాబు సరసన మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. శ్రీను వైట్ల – 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ – మహేష్ బాబు కాంబినేషన్ లో ‘దూకుడు’ తర్వాత వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు