ఆర్. నారాయణమూర్తికి కేసీఆర్ పాట..!

ఆర్. నారాయణమూర్తికి కేసీఆర్ పాట..!

Published on Mar 27, 2015 12:52 AM IST

Narayana-Murthy-and-kcr
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్), విప్లవ కథానాయకుడంటే మొదటగా గురొచ్చే ఆర్. నారాయాణమూర్తి కోసం ఓ పాట రాయనున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఆర్. నారాయణమూర్తి కథానాయకుడుగా ‘బోనాల పోతరాజు’ పేరుతో ఓ సినిమా మొదలైన విషయం తెలిసిందే. గతంలో ‘కొమరం భీం’ చిత్రాన్ని తీసిన అల్లాణి శ్రీధర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఓ పాట కోసం కేసీఆర్‌ను సంప్రదించగా ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.

పాటలు రాయడం కేసీఆర్‌కు ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో ‘జై బోలో తెలంగాణా’ చిత్రం కోసం ‘గారడీ చేస్తుండ్రు..’ అన్న పాటను రాసింది కేసీఆరే. తాజాగా ఇప్పుడు మరో పాట రాస్తున్నారన్న వార్త ప్రచారంలోకి రావడం విశేషం. తెలుగులో మాష్టర్ డిగ్రీ చేసిన కేసీఆర్‌కు సాహిత్యమంటే విపరీతమైన అభిమానం. కొన్ని వందల పుస్తకాలను చదివిన అనుభవమున్న కేసీఆర్‌కు, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతో పాటు సాహిత్యంపై కూడా మంచి పట్టు ఉంది. ఆ రకంగానే కేసీఆర్‌ను దర్శకుడు కలిసినట్టు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు