అదే బ్యానర్ లో రెండో సినిమా మొదలుపెట్టిన హీరో !

అదే బ్యానర్ లో రెండో సినిమా మొదలుపెట్టిన హీరో !

Published on Mar 18, 2018 11:35 AM IST

ఉగాది సందర్భంగా ఈరోజు ఉదయం నాగ శౌర్య కొత్త సినిమా ప్రారంభం అయ్యింది. ఈ చిత్రాన్ని శ్రీనివాస్ చక్రవర్తి అనే కొత్త దర్శకుడు రూపొందించబోతున్నాడు. నర్తనశాల అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కబోవడం విశేషం. ఈ సినిమాను నాగ శౌర్య సొంత నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్ సంస్థలో నిర్మించబడుతోంది. కామెడి ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతోందని సమాచారం.

ఈ సినిమా దర్శకుడు కార్తీక్ శ్రీనివాస్ గతంలో క్రిష్ణవంశి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచెయ్యడం జరిగింది. నందిని రెడ్డి, అవసరాల శ్రీనివాస్, వంశి పైడిపల్లి ఈ సినిమా పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మహిత్ సాగర్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. చలో సక్సెస్ తరువాత నాగ శౌర్య నటిస్తోన్న సినిమా ఇదే. ప్రముఖ రచయిత లక్ష్మి భూపాల ఈ చిత్రానికి మాటలు రాస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు