రోబో 2 లో అక్షయ్ కుమార్ గెటప్ వెనకున్న అసలు కారణం !

రోబో 2 లో అక్షయ్ కుమార్ గెటప్ వెనకున్న అసలు కారణం !

Published on Dec 3, 2016 2:20 PM IST

robo2
శంకర్ డైరెక్షన్లో రూపొందుతున్న ‘రోబో’ సీక్వెల్ ‘2.0’ ఫస్ట్ లుక్స్ కొద్దీ రోజుల క్రితమే విడుదలై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ లుక్స్ అన్నింటిలోకి అక్షయ్ కుమార్ పాత్రకు చాలా గుర్తింపు వచ్చింది. ఈ చిత్రంలో ఆయన విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ఆ పాత్ర పేరు అఖి. షూటింగ్ స్పాట్ నుండి విడుదలైన ఈ పాత్ర తాలూకు ఫోటోలు అందరికీ విపరీతమైన క్యూరియాసిటీని కలిగించాయి. అక్షయ్ వేషధారణ కాకి రూపాన్ని పోలి ఉండటంతో అసలు శంకర్ ఈ పాత్రను ఇంత వైవిధ్యంగా ఎందుకు డిజైన్ చేశాడు. దీనికి ఏదైనా ప్రత్యేక కారణముందా అనే అనుమానాలు అందరిలోనూ కలిగాయి.

ఆ అనుమానాలన్నింటికీ సమాధానం అన్నట్టుగా ఈ పాత్ర వెనకున్న అసలు నిజం తాజాగా బయటపడింది. ఆ నిజం ఏమిటంటే ఈ చిత్రంలో అక్షయ్ పాత్రలో క్రూరత్వంతో పాటు ప్రేమ కూడా ఉంటుందట. ఆ ప్రేమ మనుషులపై కాదు పక్షులపై. అందుకే అక్షయ్ తనకిష్టమైన కాకి రూపంలోనే ఉంటాడట. ఆ పక్షి ప్రేమ కోణాన్ని ఆవిష్కారించాడానికి శంకర్ అక్షయ్ కుమార్ కు పక్షులకు మధ్య చాలా సన్నివేశాలను రూపొందించాడట. ఈ సన్నివేశాల్లో లోకల్, విదేశాలకు చెందిన రకరకాల పక్షులు చాలానే ఉన్నాయట. దీన్నిబట్టి చూస్తే పక్షి ప్రేమికుడైన విలన్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని తెలుస్తోంది. ఇకపోతే ఈ రూ.400 కోట్ల భారీ బడ్జెట్ చిత్రాన్ని 2017 దీపావళికి విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు