‘జనతా గ్యారేజ్’ 100కోట్లు వసూలు చేస్తుందని ముందే ఊహించా!
Published on Sep 26, 2016 10:32 am IST

Sai-Kumar-
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ సినిమాతో తన కెరీర్లోనే అతిపెద్ద హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే 130 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా నాలుగో వారం కూడా ప్రదర్శితమవుతూ ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమా ఇంతటి విజయం సాధిస్తుందని తాను ముందుగానే ఊహించానని, జనతా గ్యారేజ్‌లో ఓ కీలక పాత్రలో నటించిన సీనియర్ నటుడు సాయి కుమార్ తెలిపారు. ఎన్టీఆర్‌తో కలిసి నటించడం పెద్ద ఎన్టీఆర్‌తో కలిసి నటించినట్లే ఉంటుందని తెలుపుతూ సాయి కుమార్ సినిమా విజయం పట్ల తన ఆనందాన్ని పంచుకున్నారు.

“జనతా గ్యారేజ్ షూటింగ్ జరిగేప్పుడే ఎన్టీఆర్‌తో ‘ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుంది’ అని చెప్పా. ఇప్పుడు అదే నిజమవ్వడం ఆనందంగా ఉంది” అన్నారు. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ సినిమాలతో టాప్ లీగ్‌లో చేరిపోయిన దర్శకుడు కొరటాల శివ, ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్‌ని ఖాతాలో వేసుకొని ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో సమంత, నిత్యా మీనన్‌లు హీరోయిన్లుగా నటించగా, మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ ప్రధాన పాత్రలో నటించారు.

 
Like us on Facebook