“మాస్టర్” సినిమాను ఆపమంటూ లేఖ!

“మాస్టర్” సినిమాను ఆపమంటూ లేఖ!

Published on Jun 5, 2020 5:47 PM IST

కరోనా కారణంగా విడుదలకు ఆగిపోయిన భారీ చిత్రాల్లో ఇళయ థలపతి విజయ్ నటించిన “మాస్టర్” సినిమా కూడా ఒకటి. విజయ్ సినిమా వస్తుంది అంటే కోలీవుడ్ లో ఏర్పడే హైప్ కానీ మాస్ క్రౌడ్ పుల్లింగ్ కానీ వేరే స్థాయిలో ఉంటుంది. దీనితో ఈ సినిమా కోసం విజయ్ ఫ్యాన్స్ ఎంత గానో ఎదురు చూస్తున్నారు.

అందులోనూ “ఖైదీ” లాంటి థ్రిల్లింగ్ హిట్ ను అందజేసిన లోకేష్ కనగ్ రాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇప్పుడిప్పుడే థియేటర్స్ మళ్ళీ తీర్చుకోవడానికి సన్నాహాలు జరుగుతుంటే కోలీవుడ్ లో థియేటర్స్ తెరుచుకున్న విడుదల కాబోయే మొదటి సినిమా “మాస్టర్” చిత్రమే అని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది.

దీనితో ఈ చిత్రాన్ని ఆపమంటూ ప్రముఖ దర్శకుడు మరియు మాజీ సినీ నిర్మాత మండలి అధ్యక్షుడు కేయార్ ముఖ్యమంత్రికి లేఖ రాసినట్టు తెలుస్తుంది. ఇలాంటి సమయంలో ఈ చిత్రాన్ని కనుక విడుదల చేస్తే థియేటర్స్ కు భారీ ఎత్తున జనం వస్తారని అప్పుడు కరోనా మరింత స్థాయిలో విస్తరణ చెందుతుంది అని అందుకే ఈ సినిమాను ఇప్పుడప్పుడే విడుదల చేయకుండా ఉంటేనే మంచిది అని ఆ లేఖలో పేర్కొన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు