చిన్న సినిమాను దత్తత తీసుకున్న సీనియర్ హీరో !

చిన్న సినిమాను దత్తత తీసుకున్న సీనియర్ హీరో !

Published on Nov 22, 2017 3:53 PM IST

కథా నాయకుడి నుండి ప్రతి నాయకుడిగా మారి మంచి సక్సెస్ లు అందుకుంటూ ముందుకెళుతున్న నటుడు జగపతిబాబు చిన్న సినిమాలకు తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని ప్రకటించారు. ప్రమోషన్లు సరిగా లేకపోవడం, మంచి రిలీజ్ దొరక్కపోవడంతో ,మంచి మంచి చిన్న సినిమాలు వెనుకబడిపోతున్నాయని పలుసార్లు మనసులో మాటని బయటపెట్టిన జగపతి ఆ పరిస్థితి నుండి వాటిని కాపాడేందుకు తన వంతు ప్రయత్నం మొదలుపెట్టారు.

అందులో భాగంగానే ఇటీవలే లాంచ్ అయిన చిన్న సినిమా ‘రచయిత’ ను దత్తత తీసుకుని దానికి సరైన ప్రచారం కల్పించి మంచి విడుదలను అందించనున్నారు. ‘సరిపడినన్ని థియేటర్లు లేకపోవడం, కొనుగోలు చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు ముందుకురాకపోవడమే దీనికి కారణమని, ఆ పరిస్థితిని తప్పించడమే నా ఈ ప్రయత్నమని’ జగపతిబాబు అన్నారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు