సోదరుడ్ని కోల్పోయిన సీనియర్ స్టార్ హీరో !
Published on Mar 19, 2017 9:49 am IST


సీనియర్ స్టార్ హీరో, విశ్వనటుడు కమల్ హాసన్ తన సోదరుడు చంద్రహాసన్ ను కోల్పోయారు. లండన్లోని తన కుమార్తె అను హాసన్ వద్ద నివసిస్తున్న 82 ఏళ్ల చంద్రహాసన్ నిన్న మార్చి 18 రాత్రి ఆకస్మిక గుండెపోటుతో మరణించారు. ఈ మధ్యే చంద్రహాసన్ భార్య గీతామణి కూడా మరణించారు.

ఎప్పుడూ పెద్దగా బయటకు కనిపించని చంద్రహాసన్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ సంస్థ యొక్క వ్యవహార భాద్యతలను నిర్వహిస్తుంటారు. ఆయన కమల్ హాసన్ తో ‘నాలా దమయంతి, విరుమంద, విశ్వరూపం, ఉత్తమ విలన్’ వంటి చిత్రాలను నిర్మించారు. అలాగే ప్రస్తుతం కమల్ హాసన్ నటిస్తూ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ‘శభాష్ నాయుడు’ చిత్రానికి కూడా నిర్మాణ భాధ్యతలు నిర్వహించిన ఆయన ‘విశ్వరూపం 2’ ను కూడా నిర్మాణ పనుల్లో ఉండేవారు.

 
Like us on Facebook