తెలుగులో సినిమా చేయాలనుకుంటున్న సెన్సేషనల్ తమిళ దర్శకుడు !

తెలుగులో సినిమా చేయాలనుకుంటున్న సెన్సేషనల్ తమిళ దర్శకుడు !

Published on Mar 22, 2017 5:17 PM IST


ఈమధ్య తమిళ సినీ పరిశ్రమలో ఒక దర్శకుడి పేరు మారు మోగిపోయింది. కేవలం ఒకే ఒక్క సినిమాతో అతను 10 సినిమాల క్రెడిట్ దక్కించుకున్నాడు. అతనే ‘ధ్రువంగల్ పతిన్నారు’ ను తెరకెక్కించిన కార్తిక్ నరేన్. స్టార్ కాస్ట్, స్టార్ క్రూ లేకుండానే కథ, స్క్రీన్ ప్లేను నమ్ముకుని సినిమా చేసిన ఈ 21 కుర్రాడు ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ గా మారిపోయాడు. ఆయన చిత్రాన్ని తెలుగులో చదలవాడ బ్రదర్స్ సమర్పించారు. మొదట సింగిల్ స్క్రీన్లో రిలీజైన ఈ చిత్రం ఆ తర్వాత మెల్లగా సంఖ్యను పెంచుకుని ఇప్పటికి రూ. 2 కోట్లు వసూలు చేసిందని నిర్మాత చదలవాడ శ్రీనివాస్ అన్నారు.

ఇక దర్శకుడు కార్తిక్ నరేన్ మాట్లాడుతూ ‘ఈ సినిమా తమిళంలో ఏమాత్రం హైప్ లేకుండా రిలీజయింది. ఆ తర్వాత మీడియా రాసిన రివ్యూల వలన జనాలకు తెలిసి అందరూ చూడ్డానికి వచ్చారు. డిసెంబర్ చివర్లో విడుదలైన సినిమా ఇప్పటికీ కొన్ని థియేటర్లలో స్ట్రాంగా నడుస్తోంది. ఈ సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన శ్రీనివాస్ గారికి నా కృతజ్ఞతలు. ఆయన బ్యానర్లో త్వరలో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాను’ అన్నారు. నరేన్ అన్నట్టే తిరుమల తిరుపతి క్రియేషన్స్ బ్యానర్ పై సినిమా చేస్తే అది తప్పకుండా తెలుగు, తమిళ ద్విభాషా చిత్రమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు