ముందుగా ‘ఖైదీ’ ఆ తరువాత ‘శాతకర్ణి’ !

khaidi-gpsh
రాబోయే సంక్రాంతి సీజన్ చాలా ఏళ్ల తరువాత అసలైన కళ సంతరించుకోనుంది. అందుకు కారణం మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం 150’ తో బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమీపుత్రశాతకర్ణి’ తో చాలా ఏళ్ల తరువాత సంక్రాంతి బరిలోకి దిగుతుండటమే. ఈ రెండు మైలు రాళ్ళ లాంటి సినిమాల విషయంలో అభిమానుల్లో, ప్రేక్షకుల్లో తారా స్థాయి అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ రెండు సినిమాలకి పలు అంశాల్లో తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. ఇకపోతే షూటింగ్ తో సహా దాదాపు అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రాలు త్వరలో ఒక ముఖ్యమైన ఫార్మాలిటీని జరుపుకోనున్నాయి.

అదే సెన్సార్ కార్యక్రమం. అయితే ముందుగా చిరు ‘ఖైదీ నెం 150’ డిసెంబరు 29న సెన్సార్ కు వెళుతుందని ఆ తరువాత బాలకృష్ణ ‘శాతకర్ణి’ జనవరి 5న సెన్సార్ జరుపుకుంటుందని సమాచారం. శాతకర్ణి కాస్త ఆలస్యంగా సెన్సార్ కు వెళ్ళడానికి కారణం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొన్ని ఇంకా జరుగుతుండటమేని వినికిడి. ఇకపోతే శాతకర్ణి ఆడియో ఈ నెల 26న భారీ ఎత్తున జరగ్గా ఖైదీ టీమ్ జనవరి 4న ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసింది. ఇక సినిమాలు కూడా కేవలం ఒక్క రోజు తేడాతో విడుదలయ్యే అవకాశముంది.

 

Like us on Facebook