రాజమౌళి చేస్తున్న అద్భుతమైన సినిమానే ‘బాహుబలి’ – సెంథిల్ కుమార్

రాజమౌళి చేస్తున్న అద్భుతమైన సినిమానే ‘బాహుబలి’ – సెంథిల్ కుమార్

Published on Oct 24, 2014 12:11 AM IST

Senthil1
టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో, భారీ టెక్నికల్ వాల్యూస్ తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఎక్కువ టైం తీసుకొని చేస్తున్న పీరియాడిక్ ఫిల్మ్ ‘బాహుబలి’. ఎస్ఎస్ రాజమౌళి, అతని టీం గత 2 సంవత్సరాలుగా పలు డిఫరెంట్ లోకేషన్స్ లో ఎంతో కష్టపడి ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారు.

ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న కెకె సెంథిల్ కుమార్ బాహుబలి గురించి మాట్లాడుతూ ‘గత 2 సంవత్సరాలుగా ఈ సినిమా చేస్తూనే ఉన్నాం. ఈ సినిమా చూడాలని మీరు ఎంత వెయిట్ చేస్తున్నారో, మా టీం కూడా అంతే వెయిట్ చేస్తున్నారు. మనందరి కోసం రాజమౌళి గారు ఈ అద్భుతమైన సినిమాని తీస్తున్నారు. దానికోసం ఆయన ఎంతో కష్టపడుతున్నారు. ఆయన్ని స్పూర్తిగా తీసుకొని మేము కూడా కష్టపడుతున్నాం. మేము ఎంతో కష్టపడి చేస్తున్న ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాని’ అన్నాడు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ కి బ్రదర్ గా రానా కనిపిస్తుంటే అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇంటర్నేషనల్ టెక్నికల్ స్టాండర్డ్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజువల్స్ ఎఫెక్ట్స్ హాలీవుడ్ ని తలపించేలా ఉంటాయని అంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు