బాలయ్య 101వ సినిమా ‘ఆదిత్య 999’.?

బాలయ్య 101వ సినిమా ‘ఆదిత్య 999’.?

Published on Aug 3, 2015 11:32 AM IST

balakrishna
నందమూరి బాలకృష్ణ కెరీర్లో మరువలేని మెయిలు రాయిగా నిలవడమే కాకుండా టాలీవుడ్ లో కూడా ఓ బెంచ్ మార్క్ మూవీగా నిలిచిన సినిమా ‘ఆదిత్య 369’. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లోనే సెన్సేషన్ క్రియేట్ చెయ్యడమే కాకుండా మనకు భూత, భవిష్యత్, వర్తమాన కాలాలను చూపించి థ్రిల్ చేసింది. కొంత కాలం క్రితం బాలకృష్ణ చేయబోయే 99వ సినిమా ఆదిత్య 369 సీక్వెల్ అని అన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. బాలకృష్ణ కూడా తన తదుపరి సినిమాలలో బిజీ అయిపోయాడు.

తాజాగా వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 మళ్ళీ తెరపైకి వచ్చింది. ఇప్పటికే సింగీతం శ్రీనివాసరావు ఆదిత్య 999 కి సంబందించిన పూర్తి కథని సిద్దం చేసారని, అది బాలకృష్ణకి కూడా బాగా నచ్చడంతో ఈ సినిమా చెయ్యడానికి బాలయ్య ఉత్సాహంగా ఉన్నారని సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ 99వ సినిమా ‘డిక్టేటర్’ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన 100వ సినిమా ఉంటుంది. ఆ తర్వాతే వచ్చే 101వ సినిమాగా బాలకృష్ణ ‘ఆదిత్య 999’ చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం. సింగీతం శ్రీనివాసరావు కూడా ఈ లోపు పగడ్బందీ స్క్రిప్ట్ మరియు ప్రీ ప్రొడక్షన్ చేసే పనిలో ఉన్నారు. ఈ సీక్వెల్ వార్త బాలయ్య అభిమానుల్లో ఆసక్తిని పెంచింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు