‘సీక్వెల్ ఆఫ్ గీతాంజలి’ రెడీ..

‘సీక్వెల్ ఆఫ్ గీతాంజలి’ రెడీ..

Published on Dec 18, 2014 11:29 AM IST

Anjali-Geethanjali-Movie
తెలుగమ్మాయి అంజలి హీరోయిన్ గా నటించిన లేడీ ఓరియెంటెడ్ హారర్ కామెడీ సినిమా ‘గీతాంజలి’. కోన వెంకట్ సమర్పణలో రాజ్ కిరణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయ కేతనం ఎగురవేసింది. మంచి వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రెడీ అవుతుంది.

‘సీక్వెల్ ఆఫ్ గీతాంజలి’ అనే వర్కింగ్ టైటిల్ తో స్క్రిప్ట్ వర్క్స్ మొదలయ్యాయి. రాజ్ కిరణ్ దర్శకత్వంలో చినబాబు ఈ సీక్వెల్ ను నిర్మించనున్నారు. స్టార్ హీరో హీరోయిన్లు ఈ సినిమాలో నటిస్తారు. త్వరలో షూటింగ్ ప్రారంభమవుతుంది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని నిర్మాత చినబాబు తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు