డిసెంబర్ లో పండగ చేసుకోనున్న చిన్న సినిమాలు !

డిసెంబర్ లో పండగ చేసుకోనున్న చిన్న సినిమాలు !

Published on Dec 3, 2016 4:19 PM IST

TFI
ఈ డిసెంబర్ నెల మొత్తం చిన్న సినిమాల సందడితో హోరెత్తనుంది. ఇన్నాళ్లు కరెన్సీ కొరత వలన అన్ని పనులు పూర్తైనా కూడా విడుదలకు వెనక్కు తగ్గిన చిన్న నుండి మీడియం రేంజ్ సినిమాలన్నీ డిసెంబర్ లోనే రిలీజ్ డేట్లు ఫిక్స్ చేసుకుని కూర్చున్నాయి. పైగా పెద్ద సినిమాలైన రామ్ చరణ్ ‘ధృవ’, సూర్య ‘సింగం 3’ లు ఒకటి నెల ఆరంభంలో మరొకటి నెలాఖరులో విడుదల కానుండటంతో మధ్యలో రోజులన్నీ చిన్న సినిమావే అయ్యాయి.

ముందు డిసెంబర్ నెలాఖరున రావాలనుకున్న చిత్రాలు సైతం వారం ముందుగానే థియేటర్లలోకి దిగిపోతున్నాయి. అలాంటి సినిమాల్లో దిల్ రాజు నిర్మించిన హెబ్బా పటేల్ ‘నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్’, నవీన్ చంద్ర, కమెడియన్ పృథ్విలు చేసిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ చిత్రాలు డిసెంబర్ 16న రిలీజ్ అవుతున్నాయి. అలాగే నెలాఖరు 23న సింగం తో పాటు నాని, కీర్తి సురేష్ లు జంటగా నటించిన ‘నేను లోకల్’, మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో చేసిన ‘లక్ష్మి బాంబ్’ కూడా అదే రోజున వస్తోంది. అలాగే అమీర్ ఖాన్ నటించిన బాలీవుడ్ చిత్రం ‘దంగల్’ కు తెలుగు డబ్ ‘యుద్ధం’ కూడా 23వ తేదీనే బరిలోకి దిగుతోంది. ఇన్ని వరుస సినిమాల వలన డిసెంబర్ నెల మొత్తం థియేటర్లు కళకళలాడబోతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు