బాహుబలి వీడియో స్ప్రెడ్ చేస్తే మీకు కఠిన శిక్ష.!

బాహుబలి వీడియో స్ప్రెడ్ చేస్తే మీకు కఠిన శిక్ష.!

Published on Jan 27, 2015 8:33 AM IST

Baahubali

గత కొద్ది రోజులుగా టాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా బాహుబలి’కి చెందిన 12 నిమిషాల వీడియో లీక్ అయ్యింది. ఈ వీడియోకి ఇంకా విఎఫ్ఎక్స్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాలేదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ విషయం పై నిర్మాతలు మరియు ఫిల్మ్ చాంబర్ కి చెందిన పైరసీ సెల్ వారు ఈ వీడియో స్ప్రెడ్ చేస్తున్న వారిపై సీరియస్ యాక్షన్ తీసుకోనున్నారు.

ఈ చిత్ర టీం ఎంతో కష్టపడి చేసిన ఈ మూవీలోని ఓ వార్ సీక్వెన్స్ ఇలా బయటకి రావడంతో వాళ్ళ కష్టం అంతా వృధా అయిపోయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాగే పేస్ బుక్, ట్విట్టర్ ద్వారా ఈ వీడియోని స్ప్రెడ్ చేస్తున్న వారిపై కేసులు ఫైల్ చేసారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్స్, సైబర్ క్రైమ్ డివిజన్ వారు ఫేస్ బుక్, ట్విట్టర్ లలో షేర్ చేస్తున్న వారిని ట్రాక్ చేసి వారిని పట్టుకోనున్నారు.

ఇప్పటికే ఇలా దొరికిన కొందరిని అరెస్ట్ చేసారు. పోలీస్ అఫీషియల్స్ వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు.నిర్మాతలు మరియు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆంటి పైరసీ టీం కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని పైరసీ చేస్తున్న వారిపై సీరియస్ యాక్షన్ తీసుకోనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు