“జెర్సీ” కి భారీగా డిమాండ్ చేస్తున్నాడట.!

“జెర్సీ” కి భారీగా డిమాండ్ చేస్తున్నాడట.!

Published on Sep 24, 2020 12:02 PM IST

ఈ మధ్య కాలంలో మన టాలీవుడ్ లో మంచి కంటెంట్ తో కూడిన చిత్రాలు అన్ని సూపర్ డూపర్ హిట్లుగా నిలవడం మాత్రమే కాకుండా ఆ చిత్ర విజయాలు జాతీయ స్థాయి ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాయి. అలాంటి కొన్ని చిత్రాల్లో నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కించిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా “జెర్సీ” కూడా ఒకటి.

ఈ చిత్రం మన దగ్గర మంచి హిట్ కావడంతో ఈ చిత్రం తాలూకా రీమేక్ హక్కులను బాలీవుడ్ వర్గాలు సొంతం చేసుకున్నాయి. అలాగే అక్కడ మన తెలుగు “అర్జున్ రెడ్డి” ని రీమేక్ చేసి భారీ హిట్ ను సొంతం చేసుకున్న షాహిద్ కపూర్ నే ఈ చిత్రంలో కూడా హీరోగా కనిపించడం ఫిక్స్ అయ్యింది.

అయితే “కబీర్ సింగ్” హిట్ తో మార్కెట్ ను పెంచుకున్న షాహిద్ ఈ చిత్రానికి ఒక్కసారిగా రెమ్యునరేషన్ పెంచినట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి కేవలం తన రెమ్యునరేషన్ గా 35 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. ఇదంతా అర్జున్ రెడ్డి రీమేక్ మహాత్యమే అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఈ చిత్రంను అక్కడ కూడా గౌతమే దర్శకత్వం వహించనుండగా మృణాల్ ఠాకూర్ ను ఫీమేల్ లీడ్ గా ఎంచుకొన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు