‘రోబో-2’ విఎఫ్ఎక్స్ కోసం శంకర్ పెట్టిన ఖర్చు ఎంతో తెలుసా !

‘రోబో-2’ విఎఫ్ఎక్స్ కోసం శంకర్ పెట్టిన ఖర్చు ఎంతో తెలుసా !

Published on Oct 16, 2017 5:23 PM IST

శంకర్, రజనీకాంత్ ల కలయికలో రూపొందుతున్న ‘రోబో-2’ చిత్రం అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సంగతి తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శంకర్ తన విజన్ కు తగ్గట్టే భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొత్తం దాదాపుగా పూర్తవగా చివరి పాట చిత్రీకరణ జరుగుతోంది. సాధారణంగానే ఖరీదుగా సినిమాలు తీసే శంకర్ ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించనున్న విఎఫ్ఎక్స్ కోసం పెద్ద మొత్తంలోనే ఖర్చు చేస్తున్నారట.

ఆ మొత్తం రూ .90 కోట్లుగా ఉందని, గ్రాఫిక్స్ పనులన్నీ పూర్తయ్యే సరికి రూ.100 కోట్లు ఖర్చవుతాయని తెలుస్తోంది. దీంతో సినిమా బడ్జెట్ కూడా రూ. 380 కోట్ల నుండి సినిమా బయటికొచ్చేనాటికి రూ.450 కోట్లు దాటుతుందని లెక్కతేలింది. సాధారణంగా ప్రతి సినిమాలో పాటల షూట్ కు ఎక్కువగా ఖర్చు పెట్టే శంకర్ ఈ సినిమా విషయంలో మాత్రం పాటల ఖర్చు తగ్గించి ఎక్కువ మొత్తం గ్రాఫిక్స్ కోసమే కేటాయించారు. మరి ఈ స్థాయిలో లావిష్ విఎఫ్ఎక్స్ కంటెంట్ కలిగిన ఈ చిత్రం ఎలా ఉంటుందో తెలియాలంటే వచ్చేఏడాది వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు