జనవరి 14న రానున్న శంకర్ ‘ఐ’

జనవరి 14న రానున్న శంకర్ ‘ఐ’

Published on Nov 25, 2014 11:48 PM IST

I
సౌత్ ఇండియాలో ఓ మెసేజ్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ ని కమర్షియల్ హిట్ చేయడంలో దిట్ట అనిపించుకున్న సక్సెస్ఫుల్ డైరెక్టర్ శంకర్. అలాంటి శంకర్ మొదటిసారి ట్రై చేసిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ’. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే ఈ చిత్ర టీం ‘ఐ’ సినిమాని సంక్రాంతి కానుకగా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం అని తెలియజేసింది. కానీ కచ్చితమైన రిలీజ్ డేట్ ని మాత్రం అనౌన్స్ చెయ్యలేదు.

మాకు తెలిసిన విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుసుకున్న సమాచారం ప్రకారం సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ట్రైలర్ రిలీజ్ అయిన రోజు నుంచి అప్పటి వరకూ ఉన్న అంచనాలు డబుల్ అయ్యాయి. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఇండియన్ ఫిల్మ్ స్టాండర్డ్స్ ని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్ళేలా ‘ఐ’ ఉంటుందని ఈ చిత్ర టీం అంటోంది.

విక్రమ్ మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించిన ఈ సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ ఎఆర్ రెహమాన్ కూడా ప్రస్తుతం రీ రికార్డింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. తెలుగులో కూడా ‘ఐ’ పేరుతోనే రిలీజ్ అవుతున్న ఈ సినిమా తెలుగు ఆడియోని త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. ఆస్కార్ రవిచంద్రన్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు