హాలీవుడ్ మూవీతో శంకర్ ‘ఐ’ టీజర్.

హాలీవుడ్ మూవీతో శంకర్ ‘ఐ’ టీజర్.

Published on Dec 18, 2014 8:02 PM IST

I-poster
హాలీవుడ్ స్థాయిలో సౌత్ ఇండియన్ సినిమాను తెరకెక్కించిన ఘనత శంకర్ సొంతం. విక్రమ్, అమీ జాక్సన్ జంటగా నటించిన ‘ఐ’ సినిమా ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. 180 కోట్ల భారి నిర్మాణ వ్యయంతో ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించిన విజువల్ వండర్ ‘ఐ’ సినిమా ప్రచార కార్యక్రమాలను సైతం భారి స్థాయిలో నిర్వహిస్తున్నారు.

నార్త్ అమెరికాలో సుమారు 4500 స్క్రీన్ లలో డిసెంబర్ 17న విడుదలైన హాలీవుడ్ మూవీ ‘ది హాబిట్ అఫ్ బాటిల్ అఫ్ ఫైవ్ అర్మీస్’తో పాటు ‘ఐ’ టీజర్ ను ప్రదర్శిస్తున్నారు. ఒక తమిళ సినిమా ట్రైలర్ ను హాలీవుడ్ మూవీ థియేటర్ లో ప్రదర్శించడం ఇదే తొలిసారి. ఇండియాలో భారి ఎత్తున విడుదలవుతున్న అమీర్ ఖాన్ ‘పీకే’ సినిమా థియేటర్లలో ‘ఐ’ హిందీ వెర్షన్ ట్రైలర్ ను ప్రదర్శించనున్నారు.

ఏఅర్ రెహమాన్ స్వరపరిచిన తెలుగు ఆడియోను త్వరలో విడుదల చేయనున్నారు. పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ భాద్యతలు నిర్వర్తించారు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై తెలుగులో ఈ సినిమాను అనువదిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీలతో పాటు పలు విదేశి భాషలలో ఈ సినిమా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు