ఆసక్తికరమైన పాత్రలో కనిపించనున్న శర్వానంద్ !

ఈ ఏడాది ఆరంభంలో ‘శతమానంభవతి’ తో మంచి హిట్ అందుకుని ఇటీవలే ‘మహానుభావుడు’ చిత్రంతో కూడా కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకున్న యంగ్ హీరో శర్వానంద్ తన తర్వాతి సినిమాల కోసం కూడా అచ్చొచ్చిన భిన్నమైన కథల్నే ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ‘స్వామి రారా, కేశవ’ చిత్రాల దర్శకుడు సుధీర్ వర్మతో ఒక సినిమా చేయనున్నారు. ఈ సినిమా కథ కూడా హీరో పాత్రను ఆధారంగా చేసుకుని నడిచేదిగానే ఉండనుంది.

ఇందులో శర్వా పాత్రను పూర్తి భిన్నంగా డిజైన్ చేస్తున్నారట సుధీర్ వర్మ. శర్వా పాత్రలో రెండు విభిన్నమైన కోణాలుంటాయని, అవి రెండు కథకు చాలా ముఖ్యమైనవని తెలుస్తోంది. అయితే వాటిలో నెగెటివ్ షేడ్స్ ఉంటాయా లేదా అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ నిర్మించనున్న ఈ ప్రాజెక్టును త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు,

 

Like us on Facebook