‘రన్ రాజా రన్’ రెస్పాన్స్ బాగుంది – శర్వానంద్..!

‘రన్ రాజా రన్’ రెస్పాన్స్ బాగుంది – శర్వానంద్..!

Published on Jul 25, 2014 2:12 AM IST

Run Raja Run
సినిమా విడుదలైన రోజున ఎంత రెస్పాన్స్ వస్తుందో.. ‘రన్ రాజా రన్’ ఆడియో విడుదలయిన తర్వాత అంత రెస్పాన్స్ వచ్చింది. సాంగ్ ప్రోమోస్ విడుదలయిన తర్వాత చాలా మంది కాల్ చేశారు. నీ లుక్ బాగుంది. చాలా స్టైలిష్ గా ఉన్నావు అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. సాంగ్స్ కొత్తగా ఉన్నాయి. ఫస్ట్ టైం నా సినిమా ఆడియో రిలీజ్ అయిన తర్వాత ఇంత రెస్పాన్స్ రావడం చూస్తున్నాను. సినిమాటోగ్రాఫర్ మధి చాలా స్టైలిష్ గా చూపారు… అంటున్నారు హీరో శర్వానంద్.

ఘిబ్రాన్ అందించిన ఆడియో సూపర్ హిట్ అవ్వడంతో చాలా సంతోషంగా ఉన్నారు హీరో. శర్వానంద్ సరసన సీరత్ కపూర్ జంటగా నటించిన ఈ సినిమా ద్వారా సుజీత్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వంశీ, ప్రమోద్ నిర్మాతలు. ఆగస్ట్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ స్టైలిష్ రొమాంటిక్ ఎంటర్టైనర్లో వెన్నెల కిషోర్, కోట శ్రీనివాసరావుల కామెడీ హైలైట్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు