రిలీజ్ డేట్ ఫైనల్ చేసుకున్న శర్వానంద్ కొత్త సినిమా !

రిలీజ్ డేట్ ఫైనల్ చేసుకున్న శర్వానంద్ కొత్త సినిమా !

Published on Apr 30, 2017 4:09 PM IST


ఈ సంవత్సరం టాలీవుడ్ అందుకున్న విజయాల్లో యువ హీరో శర్వానంద్ నటించిన ‘శతమానంభవతి’ కూడా ఒకటి. ఈ సినిమాతో హీరోగా శర్వానంద్ స్థాయి పెరిగిందనే చెప్పాలి. అందుకే మంచి మంచి ఆఫర్లు ఆయన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన నూతన దర్శకుడు చంద్రమోహన్ దర్శకత్వంలో ‘రాధ’ అనే సినిమా చేస్తున్నాడు. మార్చి నెలలోనే రిలీజ్ అవ్వాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వలన వాయిదాపడింది. తాజాగా ఈ చిత్ర నిర్మాతలు బివిఎస్ఎన్ ప్రసాద్, భోగవల్లి బాపినీడు మే 12న సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

శర్వానంద్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం యొక్క టీజర్ కు మంచి స్పందన రావడం, శర్వానంద్తో గత సినిమా పెద్ద హిట్ కావడంతో ఈ సినిమాపై క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం మిలాన్ లో చివరి పాట షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుండగా రాధన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు