లాభాల బాట పట్టిన ‘శతమానం భవతి’!

లాభాల బాట పట్టిన ‘శతమానం భవతి’!

Published on Jan 17, 2017 5:57 PM IST

shatamanam-bhavati
డిఫరెంట్ కమర్షియల్ సినిమాలతో మెప్పిస్తూ ఉండే హీరో శర్వానంద్, తాజాగా ‘శతమానం భవతి’ అన్న సినిమాతో సంక్రాంతి కానుకగా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన విషయం తెలిసిందే. ‘ఖైదీ నంబర్ 150’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ లాంటి రెండు భారీ సినిమాల మధ్యన వచ్చినా కూడా ఈ సినిమా అందరి అంచనాలను అధిగమించి సూపర్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. విడుదలైన మూడు రోజుల్లోనే అన్ని ప్రధాన ఏరియాల్లో ఈ సినిమాకు ఓవర్ ఫ్లోస్ మొదలయ్యాయని నిర్మాత దిల్‍రాజు స్పష్టం చేశారు.

ఈమధ్య కాలంలో వచ్చిన తన అన్ని సినిమాల్లో శతమానం భవతి మాత్రమే కేవలం మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ చేరుకుందని, నేటినుంచి దాదాపుగా అన్ని ప్రధాన ప్రాంతాల్లో సినిమా లాభాల బాట పట్టిందని దిల్‌రాజు తెలిపారు. ఈవారం కూడా పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో లాంగ్‌రన్‌లో ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచే అవకాశం కనిపిస్తోంది. సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు