ఓవర్సీస్ లో ఊపందుకుంటున్న ‘శతమానంభవతి’ కలెక్షన్లు !

ఓవర్సీస్ లో ఊపందుకుంటున్న ‘శతమానంభవతి’ కలెక్షన్లు !

Published on Jan 16, 2017 7:00 PM IST

Shatamanam-Bhavati1
భారీ సంక్రాంతి పోటీ నడుమ విడుదలైన చిత్రం ‘శతమానం భవతి’ ఆ పోటీని తట్టుకొని మెల్లగా నిలదొక్కుకుంటోంది. ఇండియాలో కంటే ఒకరోజు ముందుగా ఓవర్సీస్ లో విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుండే యూఎస్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. దీంతో మొదటి రోజు శుక్రవారం $ 79,312 వసూలు సాధించింది. ఇక మొదటిరోజే టాక్ బాగుండటంతో రెండవ రోజు శనివారం కలెక్షన్లు 90 శాతం రెట్టించాయి.

ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం శనివారం కలెక్షన్లు $ 150,607 గా ఉన్నాయి. దీంతో శని, ఆది రెండు రోజులు కలుపుకుని రూ. 1.89 కోట్ల వసూలయ్యాయి. సాధారణంగా ఓవర్సీస్ లో కుటుంబ కథా చిత్రాలను ఎక్కువగా ఆదరించే సంప్రదాయం ఉండటం ఈ చిత్రానికి బాగా కలిసొచ్చింది. ఇక ఇండియాలో శనివారం విడుదలైన ఈ చిత్రం మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే టాక్ తెచ్చుకుని దూసుకుపోతోంది. నూతన దర్శకుడు సతీష్ వేగేశ్న డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ లు హీరో హీరోయిన్లుగా నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు