‘శతమానం భవతి’ ఆడియో విడుదల తేదీ ఖరారు!
Published on Dec 12, 2016 10:53 am IST

shatamanam-bhavathi
ఉత్తమ కుటుంబ కథా చిత్రాల నిర్మాత గా పేరున్న దిల్ రాజు నిర్మాణం లో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ శర్వానంద్ హీరో గా వేగేశ్న సతీష్ దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం “శతమానం భవతి”. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి 2017 కి విడుదల అవుతోన్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రం ఆడియో ని ఈ నెల 18 న హైదరాబాద్ లో వైభవం గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉంది.

” శతమానం భవతి తాతా మనవళ్ల మధ్య ఉండే బంధాన్ని చూపే ఒక అందమైన కుటుంబ కథా చిత్రం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుకుగా సాగుతున్నాయి. ఈ నెల 18 న ఆడియో ను విడుదల చేస్తున్నాము. మిక్కీ జె మేయర్ అద్భుతమైన ఆడియో ని అందించారు. జనవరి లో సంక్రాంతి పండుగ కానుకగా ఈ చిత్రం విడుదల అవుతుంది “, అని నిర్మాత దిల్ రాజు తెలిపారు.

ఈ చిత్రం లో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్ , జయసుధ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

 
Like us on Facebook