400వ సినిమాకి సైన్ చేసిన సీనియర్ నటి

400వ సినిమాకి సైన్ చేసిన సీనియర్ నటి

Published on Oct 22, 2019 6:44 PM IST

షావుకారు జానకి అంటే తెలియని దక్షిణాది సినీ ప్రేక్షకులు ఉండరు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం భాషల్లో స్టార్ నటీమణిగా వెలుగొందారు ఆమె. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, ఎంజీఆర్‌, శివాజీ గణేశన్‌, జెమిని గణేశన్‌, రాజ్‌కుమార్‌ వంటి స్టార్ హీరోలతో నటించారు జానకి. ఇప్పటి వరకు 399 చిత్రాల్లో నటించిన ఆమె కొత్తగా 400వ చిత్రానికి సైన్ చేశారు.

ఇలా 87 ఏళ్ల వయసులో కూడా ఆమె చలాకీగా
ఉంటూ సినిమాకు సైన్ చేయడం నిజంగా విశేషమనే అనాలి. ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు కన్నన్ డైరెక్ట్ చేస్తుండగా సంతానం హీరోగా నటిస్తున్నాడు. ఇలా తమ చిత్రం జానకిగారికి 400వ చిత్రం కావడం తమకు గర్వకారణమని, ఆమెను డైరెక్ట్ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని కన్నన్ తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు