మణిరత్నం, పూరిల సినిమాల్లో నటించాలనుకుంటున్న షెర్లిన్ చోప్రా

మణిరత్నం, పూరిల సినిమాల్లో నటించాలనుకుంటున్న షెర్లిన్ చోప్రా

Published on Apr 22, 2014 6:43 PM IST

Sherlyn-Chopra-hot-saree-ph
ప్లే బాయ్ మాగజైన్ కి న్యూడ్ గా ఫోజులిచ్చి సెస్నేషన్ క్రియేట్ చేయడమే కాకుండా పలు విషయాల్లో సెన్సేషనల్ కామెంట్స్ చేసి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన భామ ఎవరు అంటే వెంటనే చెప్పే పేరు షెర్లిన్ చోప్రా. వివాదాల్లో ఎందుకు ఎక్కువగా ఇరుక్కుంటారు అని అడిగితే నేను నిజం మాట్లాడతాను అందుకే వివాదాలని షెర్లిన్ సమాధానం ఇచ్చింది.

తాజాగా ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు ఏ డైరెక్టర్ డైరెక్షన్ లో అయినా సినిమా చేయాలనుకుంటున్నారా? అని అడిగితే ‘నాకు మణిరత్నం గారి సినిమాలో నటించాలని ఉంది. ఆదర్శ గురువు అనే పదానికి ఆయన పర్ఫెక్ట్ గా సరిపోతారు. అలాగే కమర్షియల్ సినిమాలు చేసే పూరి జగన్నాధ్ అన్నా నాకు చాలా ఇష్టం. ఇలాంటి వాళ్ళ సినిమాల్లో నటించాలనుకుంటున్నాను. వారు సూపర్బ్ స్టొరీ టెల్లర్స్’ అని షెర్లిన్ చోప్రా సమాధానం ఇచ్చింది.

అలాగే మాట్లాడుతూ తమిళ సినిమాల్లో నటించాలని ఉందని, తనకి సౌత్ ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అంటే చాలా గౌరవం అని చెప్పింది. ఈ వార్తలు విన్న మణిరత్నం, పూరి జగన్నాధ్ లేదా సౌత్ ఫిల్మ్ మేకర్స్ షెర్లిన్ చోప్రాకి అవకాశాలు ఇస్తారేమో చూడాలి. షెర్లిన్ చోప్రా నటించిన ‘కామసూత్ర 3డి’ ఈ సంవత్సరం సెకండాఫ్ లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు