గోపీచంద్ తో మహేష్ బాబు ఐటమ్ భామ

గోపీచంద్ తో మహేష్ బాబు ఐటమ్ భామ

Published on Nov 26, 2015 8:29 AM IST

soukam
టాలీవుడ్ లో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా ఐటమ్ సాంగ్స్ చేసే భామలకి కూడా స్పెషల్ గుర్తింపు ఉంటుంది. కచ్చితంగా ప్రతి కమర్షియల్ సినిమాలోనూ ఓ ఐటమ్ సాంగ్ ఉంటుంది. ఈ ఐటెం సాంగ్స్ లో కనిపించే కొంతమంది భామలకు ఒక్క సాంగ్ తో భలే గుర్తింపు వస్తుంది. కట్ చేస్తే వాళ్ళకి వరుసగా ఆఫర్స్ వస్తాయి. అలా తాజాగా తెలుగులో ఫేమస్ అవుతున్న ఐటమ్ భామ శ్వేత భరద్వాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘బిజినెస్ మెన్’ సినిమాలో ‘ఐ వాంట్ బాడ్ బాయ్స్’ అనే ఐటెం సాంగ్ లో మెప్పించిన ఈ శ్వేత భరద్వాజ్ ఆ తర్వాత సుశాంత్ అడ్డా సినిమాలో కనిపించి మెప్పించింది.

తాజాగా ఈ భామ గోపీచంద్ నటిస్తున్న ‘సౌఖ్యం’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. నానక్రామ్ గూడా రామానాయుడు స్టూడియోస్ లో వేసిన ఓ సెట్లో గోపీచంద్ – శ్వేత భరద్వాజ్ లపై వచ్చే సాంగ్ ని షూట్ చేస్తున్నారు. శంకర్ మాస్టర్ ఈ సినిమాకి స్టెప్స్ కంపోజ్ చేస్తున్నాడు. ఎఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. రేజీన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న రిలీజ్ చేయనున్నారు. భవ్య క్రియేషన్స్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు