శివలింగ ఆడియో విడుదల తేదీ ఖరారు !

శివలింగ ఆడియో విడుదల తేదీ ఖరారు !

Published on Jan 24, 2017 4:50 PM IST

shiva-linga
జల్లికట్టు ఉద్యమానికి మద్దత్తు తెలిపి లారెన్స్ అందరి దృష్టిని ఆకర్షించాడు. మరో ఆసక్తి కర కథాంశంతో రూపొందుతోన్న శివలింగ చిత్రంతో లారెన్స్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నిన్ననే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర ఆడియోని ఈనెల 27 న విడుదల చేయనున్నారు.

పి వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రితిక హీరోయిన్ గా నటిస్తోంది.ఆసక్తికర కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో దర్శకుడు పి వాసు కుమారుడు ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు