రామ్ ‘శివమ్’ ఆడియో రిలీజ్ డేట్

రామ్ ‘శివమ్’ ఆడియో రిలీజ్ డేట్

Published on Sep 3, 2015 12:12 AM IST

Shivam
రామ్.. గత కొన్నాళ్ళుగా ఎంతగానో ఎదురుచూస్తూ వచ్చిన హిట్ ‘పండగ చేస్కో’తో దక్కడంతో ఆ వెంటనే వరుస సినిమాలతో బిజీ బిజీ అయిపోయారు. ప్రస్తుతం తమ సొంత బ్యానర్ స్రవంతి మూవీస్‌పై రామ్ ‘శివమ్’, ‘హరికథ’ పేర్లతో రెండు సినిమాలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాల్లో ‘శివమ్’ ఇప్పటికే టాకీ పార్ట్‌తో పాటు, కొన్ని పాటలను కూడా పూర్తి చేసుకొని చివరిదశకు చేరుకుంది. అక్టోబర్ 2న ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందిస్తోన్న ఈ సినిమాలో రాశిఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఇక ఈ మధ్యే పూర్తి అయిన ఫారిన్ షెడ్యూల్‌లో రెండు అందమైన పాటలు తెరకెక్కించామని, మరో రెండు పాటల షూటింగ్‌తో సినిమా పూర్తవుతుందని రామ్ తెలిపారు. ఇక ఈ సినిమా ఆడియో రిలీజ్‌ను సెప్టెంబర్ 12న పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సినిమా యూనిట్ సన్నాహాలు చేస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియోతో పాటు ‘శివమ్’ థియేట్రికల్ ట్రైలర్‌ను కూడా అదే రోజు విడుదల చేసేందుకు సినిమా యూనిట్ ప్లాన్ చేస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు