నేషనల్ గా ట్రెండ్ అవుతున్న శివుడు

నేషనల్ గా ట్రెండ్ అవుతున్న శివుడు

Published on May 5, 2015 8:25 AM IST

prabas-shivudu
టాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా, అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ‘బాహుబలి’. మే 1 నుంచి ఈ సినిమాకి సంబందించిన ఒక్కో పోస్టర్ ని రిలీజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా బాహుబలి సినిమాలో సినిమాలో ప్రభాస్ పోషిస్తున్న ‘శివుడు’ అనే పాత్రకి సంబందించిన ఫస్ట్ పోస్టర్ ని నిన్న రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ కి అందరి నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ప్రభాస్ ఫ్యాన్స్ మరియు కామన్ ఆడియన్స్ కూడా శివుడు లుక్ చూసి అదిరిపోయింది అనే కామెంట్స్ ఇస్తున్నారు. అంతే కాకుండా ఈ శివుడు పోస్టర్ ప్రస్తుతం నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతోంది.

ఈ పోస్టర్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ లో సుమారు 7 గంటలకు పైన నేషనల్ లెవల్ లో ట్రెండ్ అయ్యింది. ఈ పోస్టర్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. బాలీవుడ్ ఫేమస్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ మరియు తమిళ ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజాలు కూడా హిందీ, తమిళ పోస్టర్స్ ని రిలీజ్ చేసారు. వాటికి కూడా ఇదే రేంజ్ రెస్పాన్స్ వస్తోంది. టాలీవుడ్ సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ట్రైలర్ ని మే 31న రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు