స్పీడు మీదున్న బాలయ్య ..!

స్పీడు మీదున్న బాలయ్య ..!

Published on Mar 25, 2017 7:08 PM IST


పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ 101 చిత్రం ఇటీవల మొదలైన విషయం తెలిసిందే.కాగా ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ షూటింగ్ ని పూరిజగన్నాథ్ పూర్తి చేసేశాడు.తాజాగా సమాచారం ప్రకారం ఈ చిత్ర రెండవ షెడ్యూల్ ఏప్రిల్ 5 నుంచి హైదరాబాద్ లో మొదలుకానున్నట్లు తెలుస్తోంది.

కొన్ని యాక్షన్ సన్నివేశాల కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ఓ సెట్ లో ఈ షెడ్యూల్ జరగనున్నట్లు తెలుస్తోంది.భవ్యక్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ ని ఇంకా ఎంపిక చేయవలసి ఉంది. పూరి బాలయ్యని ఈ చిత్రంలో సరికొత్త లుక్ లో చూపించనున్నట్లు సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు