ఇంటర్వ్యూ : శశిధర్ మర్రి – నాకు విజయ్ దేవరకొండకు మధ్యన ఎలాంటి గొడవలు లేవు

ఇంటర్వ్యూ : శశిధర్ మర్రి – నాకు విజయ్ దేవరకొండకు మధ్యన ఎలాంటి గొడవలు లేవు

Published on Mar 8, 2018 1:04 PM IST

విజయ్ దేవరకొండ, శివానీ సింగ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ‘ఏ మంత్రం వేసావే’. శశిధర్ మర్రి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. రేపే సినిమా విడుదలవుతున్న సందర్బంగా అయన మీడియాతో మాట్లాడారు. ఆ సంగతులు మీకోసం..

ప్ర) మీ నైపథ్యం చెప్పండి ?
జ) నెను హైదరాబాద్లోనే పుట్టాను. బెంగుళూరులో చదువుకున్నాను. ఇంజనీరింగ్ చేసి ఇండస్ట్రియల్ డిజైన్స్ లో మాస్టర్స్ చేశాను. ఆ తర్వాత ఐఏఎం కలకత్తాలో చదువుకుని ఇన్ఫోసిస్ లో 15 ఏళ్ల పాటు వర్క్ చేశాను.

ప్ర) మరి అంత మంచి కెరీర్ ను వదిలి సినిమాల్లోకి ఎందుకొచ్చారు ?
జ) చిన్నప్పటి నుండి నాకు కథలన్నా, థియేటర్స్ అన్నా చాలా ఇష్టం. ఎప్పటికైనా సినిమాల్లోకి రావాలనుకున్నాను. ఆ కోరికను నెరవేర్చుకోడానికే వచ్చాను.

ప్ర) ఎవరూ తెలియకుండా సినిమా ఎలా చేశారు ?
జ) నేను ఈ ఇండస్ట్రీకి చెందివాడిని కాకపోవడం, అనుభవం లేకపోవడంతో నిర్మాతలు ముందుకురారని
తెలుసు. అందుకే నేను దాచుకున్న డబ్బుతోనే ఈ సినిమా చేశాను.

ప్ర) సినిమా కథేమిటి ?
జ) సినిమా చేయాలి అనుకున్నప్పుడు మన చుట్టూ జరిగే అంశాలతోనే కథను తయారుచేసుకోవాలి అనుకుని జనాలు సోషల్ మీడియాకు, గ్యాడ్జెట్ స్ కు ఎలా అడిక్ట్ అవుతున్నారు, వాటి వలన మనుషుల మధ్యన సంబంధాలు ఎలా క్షీణిస్తున్నాయి అనే అంశాల్ని ఎంచుకుని రాసుకున్నాను.

ప్ర) హీరో విజయ్ ప్రమోషన్లలో పాల్గొనడంలేదు ఎందుకని ?
జ) అందుకు పెద్దగా కారణాలేవీ లేవు. సినిమా ఆలస్యమవడం, వేరే ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటం వలన రాలేకపోతున్నారు. అంతేగాని బయట చెపుకుంటున్నట్టు మా మధ్యన ఎలాంటి గొడవలు లేవు.

ప్ర) సినిమా ఎందుకింత ఆలస్యమైంది ?
జ) నేను 2014లో కథను రాసుకుని 2015లో షూటింగ్ స్టార్ట్ చేశాను. బెంగుళూరులో నాకో స్టార్టప్ కంపెనీ ఉంది. మధ్యలో ఆ పనులు కూడ చూసుకుంటూ ఉండటం వలన ఆలస్యమైంది.

ప్ర) ‘పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి’ లాంటి హిట్లు చూశాక మీ సినిమాలో మార్పులేవైనా చేశారా ?
జ) ఎలాంటి మార్పులు చేయలేదు. నేను మొదట ఏ కథ అయితే అనుకున్నానో దాన్నే తీశాను.

ప్ర) మల్కాపురం శివకుమార్ గారు ఈ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?
జ) సినిమా అంతా పూర్తయ్యాక నేను కొత్తవాడ్ని, సినిమా కూడ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా. అందుకే వేరే డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ ముందుకురాలేదు. అలాంటి సమయంలో శివకుమార్ గారు సినిమా చూసి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఒప్పుకున్నారు.

ప్ర) మీ తరవాతి సినిమా ఎలా ఉండొచ్చు ?
జ) నేనైతే కమర్షియల్ సినిమాలు చేయను. అర్థవంతమైన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తాను. ఎందుకంటే డబ్బు కోసం నేనీ పరిశ్రమలోకి రాలేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు