అసాధారణమైన పాత్రలో కనిపించనున్న శ్రియ

ఒకప్పటి స్టార్ హీరోయిన్, ఇన్నాళ్లు స్టార్ హీరోల సరసన గ్లామరస్ రోల్స్ లో నటించి మెప్పించిన శ్రియ శరన్ ఇప్పుడు పూర్తిగా ట్రాక్ మార్చారు. కాలంతోపాటే మారుతూ కథకు, పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం మోహన్ బాబు, విషేణుల ‘గాయత్రి’, తమిళంలో ‘నరకాసూరన్’ వంటి సినిమాలు వైవిధ్యమైన సినిమాలు చేస్తున్న ఆమె ఇప్పడు మరో కొత్త ప్రాజెక్టుకు సైన్ చేశారు.

నూతన దర్శకురాలు సుజనా డైరెక్షన్లో ఈ సినిమా ఉండనుంది. ఇందులో శ్రియ పాత్ర అసాధారణంగా, మునుపెన్నడూ ఆమె చేయని విధంగా ఉంటుందట. మార్చి నుండి షూటింగ్ మొదలుపెట్టుకోనున్న ఈ చిత్ర్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందించనుండగా సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ ను జ్ఞాన శేఖర్ వి.ఎస్ సినిమాటోగ్రఫీని అందించనున్నారు.

 

Like us on Facebook