‘శ్రీమంతుడు’ ప్రమోషన్లతో బిజీబిజీగా శృతి హాసన్!

‘శ్రీమంతుడు’ ప్రమోషన్లతో బిజీబిజీగా శృతి హాసన్!

Published on Jul 31, 2015 3:40 PM IST

shruthi-hassan
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘శ్రీమంతుడు’ కోసం మహేష్ అభిమానులే కాక, సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో ఆగష్టు 7న భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైన ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలను ఇప్పటికే వేగవంతం చేశారు.

ఇప్పటికే సోషల్ మీడియాలో ఊపందుకున్న ప్రచారం, తాజాగా సాంప్రదాయ మీడియా, పత్రికా ఇంటర్వ్యూలతో మరింత జోరుగా జరుగుతోంది. ఇక తాజాగా నేటినుంచి హీరోయిన్ శృతి హాసన్ సైతం ప్రచార కార్యక్రమాల్లో భాగమైపోయారు. పత్రికా ఇంటర్వ్యూలు, వీడియో ఇంటర్వ్యూలతో శృతి హాసన్ బిజీగా గడిపేస్తున్నారు. ఇక మహేష్, శృతి హాసన్, జగపతి బాబు, కొరటాల శివలు పాల్గొనగా ఓ ఇంటర్వ్యూ ఇప్పటికే సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ఆడియో సినిమాపై అంచనాలను పెంచేశాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు