కార్తీ సరసన శృతి హాసన్.?

కార్తీ సరసన శృతి హాసన్.?

Published on Jul 30, 2014 2:34 AM IST

karth-sruthihasan
తమిళ స్టార్ హీరో కార్తీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ‘మద్రాస్’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ కి సిద్దం చేస్తున్నాడు. ప్రస్తుతం ‘కోంబన్’ అనే సినిమా సెట్స్ పై ఉంది. ఇది కాకుండా గోకుల్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి కార్తీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం కోలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ఇద్దరు స్టార్స్ తో సంప్రదింపులు జరుపుతున్నారు.

ముందుగా కార్తీ సరసన హీరోయిన్ గా శృతి హాసన్ ని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారు. అలాగే గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న కింగ్ కమెడియన్ వడివేలుతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. అన్నీ కుదిరితే కార్తీ సరసన హీరోయిన్ గా శృతి హాసన్, కమెడియన్ గా వడివేలు నటిస్తారు. శృతి హాసన్ కూడా ప్రస్తుతం తమిళంలో సినిమాలు చేయడంలో బాగా ఆసక్తి చూపుతోంది కావున ఈ సినిమాకి సైన్ చేస్తుందనే కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇటీవలే ‘కోంబన్’ షూటింగ్ లో ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో చేరాడు. కానీ ప్రస్తుతం తను బాగున్నట్టు, అంతా సెట్ అయ్యిందని తన ఫేస్ బుక్ ద్వారా తెలిపాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు