గౌతమితో ఏ గొడవలూ లేవన్న శృతి హాసన్!

Shrutihassan
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, ఆయన కూతురు శృతి హాసన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోండగా, ‘శభాష్ నాయుడు’ అనే ఓ కామెడీ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అమెరికా నేపథ్యంలో నడిచే ఈ సినిమాకు సంబంధించిన కొద్దిభాగం షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. ఇక ఈ సినిమాకు కమల్ భార్య గౌతమి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తున్నారట. కొద్దికాలంగా కాస్ట్యూమ్స్ విషయంలో గొడవ వచ్చి గౌతమికి, శృతి హాసన్‌కు పడడడం లేదని, ఇద్దరూ ఒకరికొకరు సహకరించుకోవడం మానేశారని ప్రచారం జరుగుతోంది.

కాగా తాజాగా ఈ విషయమై ఓ స్పష్టమైన ప్రకటన చేస్తూ, తనకూ, గౌతమికి ఎటువంటి గొడవలు లేవని శృతి హాసన్ తేల్చేశారు. గౌతమితో సరదాగా సెట్స్‌లో ఉంటున్నానని, కాస్ట్యూమ్స్ విషయమై ఇద్దరం చర్చించుకొనే పనిచేస్తున్నామని, ఇలాంటి పుకార్లను నమ్మొద్దని శృతి హాసన్ ఈ సందర్భంగా తెలిపారు. ఇక కొద్దికాలం వరకూ సినిమాలకు బ్రేక్ ఇచ్చిన గౌతమి, ఇప్పుడు ‘పాపనశం’, ‘మనమంతా’ లాంటి సినిమాలతో మళ్ళీ తెరపైకి వచ్చారు. కమల్ సలహా మేరకు ఆమె శభాష్ నాయుడు సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.

 

Like us on Facebook