చెల్లెలు కోసం శృతి హాసన్ పాట..?

చెల్లెలు కోసం శృతి హాసన్ పాట..?

Published on Oct 21, 2014 2:48 PM IST

shruti-haasan
ధనుష్, అక్షర హాసన్ జంటగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలో నటిస్తున్న సినిమా ‘షమితాబ్’. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. అర్ బల్కి దర్శకుడు. కమల్ హాసన్ ముద్దుల తనయ అక్షర హాసన్ ఈ సినిమాతోనే తెరంగేట్రం చేస్తుంది. తొలి సినిమాలో అగ్ర నటులు, సంగీత దర్శకుడు, దర్శకుడితో పని చేసే అవకాశం రావడం పట్ల అక్షర సంతోషం వ్యక్తం చేస్తుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అక్షర హాసన్ అక్క శృతి హాసన్ పాట పాడుతుందట. దాదాపు 12 ఏళ్ళ తర్వాత మేస్ట్రో ఇళయరాజా సంగీతంలో శృతి హాసన్ పాట పాడనుందని టాక్. ఈ వార్త నిజమైతే కమల్ అభిమానులకు పండగే. అక్క పాటకు చెల్లెలు ఎలా స్టెప్పులు వేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు