మహేష్ సినిమాతో గ్లామర్ ట్రీట్ ఇవ్వనున్న శృతి హాసన్

మహేష్ సినిమాతో గ్లామర్ ట్రీట్ ఇవ్వనున్న శృతి హాసన్

Published on Oct 30, 2014 12:06 PM IST

Sruthi-Hasan
ప్రస్తుతం సౌత్ ఇండియా టాప్ హీరోయిన్స్ లో ఒకరుగా వెలుగొందుతున్న శృతి హాసన్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు – కొరటాల శివ క్రేజీ ప్రాజెక్ట్ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ప్రారంభమైన ఈ సినిమా తాజా షెడ్యూల్ నేటి నుంచి హైదరబాద్ ఓ ప్రారంభం కానుంది. త్వరలోనే మహేష్ బాబు ఈ సినిమా షూట్ లో పాల్గొంటాడు.

ఇప్పటికే శృతి హాసన్ చాలా సినిమాల్లో బోల్డ్ గా కనిపించడమే కాకుండా, ప్రతి సినిమాలోనూ ఆడియన్స్ కి ఫుల్ గా తన గ్లామర్ తో ఆకట్టుకుంటోంది. మహేష్ బాబు సినిమాలో శృతి హాసన్ ది గ్లామర్ రోల్ కావడంతో గత సినిమాల కంటే ఈ సినిమాలో ఎక్కువ గ్లామరస్ట్రీట్ ఉంటుందని అంటున్నారు. శృతి అభిమానులకు మరియు తెలుగు సినీ ప్రేక్షకులకు అందాల విందు కచ్చితం అని ఈ చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్న ఈ కమర్షియల్ ఎంటర్ టైనర్ 2015 సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు