దెయ్యాల టైమ్‌లో పనిచేస్తోన్న శృతి హాసన్!

shruti-haasan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానులకు వరుసగా సినిమాల పండగను కలిపించేందుకు మూడు సినిమాలను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో మొదటిదైన ‘కాటమరాయుడు’ ఇప్పటికే సెట్స్‌పైకి వెళ్ళి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం హైద్రాబాద్‌లో ఓ షెడ్యూల్ జరుపుకుంటోంది. వారం రోజులుగా రాత్రిపూట షూట్ జరుపుతూ వస్తున్నారు.

ఇక అర్థరాత్రుల్లు దయ్యాల టైమ్‌లో షూట్ చేస్తున్నానని, అయినా నటిస్తూ ఉండడం అద్భుతంగా ఉంటుందని శృతి హాసన్ అన్నారు. కాటమరాయుడు షూట్ చాలా సరదాగా సాగిపోతోందని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. ఉగాది పండగను పురస్కరించుకొని మార్చి 29, 2017న కాటమరాయుడు విడుదల కానుంది. నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శరత్ మరార్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు డాలీ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో ఘన విజయం సాధించిన వీరమ్‌కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతుందన్న ప్రచారం జరుగుతోంది.

 

Like us on Facebook