‘సంఘమిత్ర’ నుండి తప్పుకున్న శృతి హాసన్ !

‘సంఘమిత్ర’ నుండి తప్పుకున్న శృతి హాసన్ !

Published on May 29, 2017 4:46 PM IST


ప్రముఖ దర్శకుడు సుందర్.సి రూపొందించనున్న ఇండియాస్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ‘సంఘమిత్ర’. ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారిగా స్టార్ హీరోయిన్ శృతి హాసన్ నటిస్తుందనేది మొదటి నుండి అందరికీ తెలిసిన విషయయే. ఈ సినిమా కోసం శ్రుతిహాసన్ లండన్ వెళ్లి మరీ యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకుంది. తాజాగా జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు కూడా సుందర్. సి, జయం రవి, ఆర్య, శృతి హాసన్ అందరూ కలిసి వెళ్లి సినిమానౌ అనౌన్స్ చేశారు. అంతేగాక శృతి హాసన్ ఫస్ట్ లుక్ ను కూడా రివీల్ చేశారు.

కానీ ఉన్నట్టుండి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంస్థ శ్రీ తేనండాల్ ఫిల్మ్స్ కొన్ని అనివార్య కారణాల వలన ఈ సినిమాను శృతి హాసన్ తో చేయలేకపోతున్నామని ప్రకటించింది. ఈ వార్తతో సినిమాపై బోలెడు అంచనాలతో ఉన్న ప్రేక్షకులంతా విస్మయానికి గురయ్యారు. ఇప్పుడందరిలోను అసలు శృతి హాసన్ ఈ సినిమా నుండి తప్పుకోవడానికి కారణాలేమయ్యుంటాయి, ఆమె కాకపొతే ఆ పాత్రలోకి మరెవర్ని తీసుకుంటారు అనే ప్రశ్నలు తలెత్తాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు