సిద్దార్ధ్, తెలుగులో ఎప్పుడు విడుదల చేస్తావ్..?

సిద్దార్ధ్, తెలుగులో ఎప్పుడు విడుదల చేస్తావ్..?

Published on Mar 6, 2015 2:28 PM IST

Siddharth
మాస్ హీరో అనిపించుకునే క్రమంలో సిదార్ద్ చేసిన ప్రయత్నాలు తెలుగులో బెడిసికొట్టాయి. ‘బొమ్మరిల్లు’ తర్వాత అతను తెలుగులో నటించిన ఒక్క సినిమా కూడా భారి హిట్ కాలేదు, మరోవైపు విమర్శకుల బాణాలకు బలయ్యాయి. ‘జబర్దస్త్’ ప్లాప్ తర్వాత కేవలం తమిళంలో సినిమాలు చేయడంపై దృష్టి పెట్టాడు సిద్దార్ధ్.

గత ఏడాది అతను తమిళంలో నటించిన ‘జిగర్తాండ’, ‘కావ్య తలైవన్’ సినిమాలు విమర్శకులు ప్రశంసించారు. ‘జిగర్తాండ’ కమర్షియల్ సక్సెస్ సాధించింది. తాజాగా ఈ శుక్రవారం విడుదలైన ‘ఎణక్కుల్ ఒరువన్’ సినిమాకు మంచి రివ్యూలు వచ్చాయి. కమర్షియల్ సక్సెస్ సాదించే సత్తా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

చాలా మంది తమిళ హీరోలు తెలుగులో మార్కెట్ పెంచుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారు. తమిళంలో హిట్టయిన సినిమాలను ఇక్కడ డబ్బింగ్ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అలాంటిది తెలుగులో మంచి మార్కెట్, ఫ్యాన్ ఫాలోయింగ్ కల సిదార్ద్, తన సినిమాలను తెలుగులో విడుదల చేయడంపై దృష్టి పెట్టడం లేదు. అందుకే, అతని అభిమానులు తెలుగులో నీ సినిమాలను ఎప్పుడు విడుదల చేస్తావ్ సిద్దార్ధ్..? అని అడుగుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు