యాక్షన్ హీరో ఇమేజ్ కోరుకుంటున్న సిద్దార్ధ్..!

యాక్షన్ హీరో ఇమేజ్ కోరుకుంటున్న సిద్దార్ధ్..!

Published on Jul 31, 2014 3:17 AM IST

Siddharth
‘బొమ్మరిల్లు’ హీరో సిద్దార్ధ్ తన ఫ్యామిలీ హీరో, చాక్లెట్ బాయ్ ఇమేజ్ ఇంకెంత మాత్రం తనకు వద్దని అంటున్నాడు. యాక్షన్ హీరో ఇమేజ్ కోరుకుంటున్నాడు. సిద్దార్ధ్ తమిళంలో నటించిన తాజా సినిమా ‘జిగర్తాండ’. తెలుగులో ఈ సినిమా ‘చిక్కడు దొరకడు’ పేరుతో విడుదల అవుతుంది. మ్యూజికల్ గ్యాంగ్ స్టర్ లవ్ స్టొరీగా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా కోసం సిద్దార్ధ్ తన లుక్ చేంజ్ చేశాడు. ఆగస్ట్ 1న ‘జిగర్తాండ’ విడుదల అవుతుంది.

‘జిగర్తాండ’ విడుదల సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్దార్ధ్ తన మనసులో మాటను బయటపెట్టారు. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలలో ‘జిగర్తాండ’ చాలా డిఫరెంట్ ఫిల్మ్. ఈ సినిమాలో రఫ్ లుక్ లో కనిపిస్తాను. బాయ్ నెక్స్ట్ డోర్, ఫ్యామిలీ టైపు క్యారెక్టర్లు చేసిన నాకు ఇమేజ్ చేంజ్ చేసుకోవాలని అనిపించింది. చాక్లెట్ బాయ్ అనే పదం నచ్చడం లేదు. అలాంటి సమయంలో కార్తీక్ సుబ్బరాజ్(పిజ్జా ఫేం) మంచి కథ తీసుకొచ్చాడు. సినిమా కూడా బాగా వచ్చింది. ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అని అన్నారు.

తెలుగులో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ తర్వాత మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించి కొన్ని సినిమాలు చేసి చేదు పలితాలను ఎదుర్కున్నాడు. తమిళంలో సక్సెస్ దక్కుతుందో..? లేదో..?

సంబంధిత సమాచారం

తాజా వార్తలు