మరో మారు వాయిదా పడిన సింగం 3 !

మరో మారు వాయిదా పడిన సింగం 3 !

Published on Jan 23, 2017 3:21 PM IST

s3
సూర్య , శ్రుతిహ‌స‌న్‌, అనుష్క‌లు జంట‌గా నటిస్తున్న చిత్రం సింగం 3. ఈ చిత్రానికి హ‌రి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్నిస్టూడియో గ్రీన్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. హారిస్ జైరాజ్ సంగీతం అందించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి జ‌న‌వరి 26 న విడుద‌ల కావ‌ల‌సిన ఈ చిత్రం త‌మిళ‌నాట జల్లికట్టు ఉద్యమం కారణంగా విడుదల వాయిదా పడింది.

ఈ సందర్భంగా నిర్మాత‌ మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ.. త‌మిళ‌, తెలుగు బాష‌ల్లో ఈనెల 26 న విడుద‌ల కావ‌ల‌సిన సింగం 3 చిత్రం విడుద‌ల వాయిదా వేశాము. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంగా విడుద‌ల చేయ‌టానికి ప్లాన్ చేసిన ఈ చిత్రం ప్ర‌స్తుతం జ‌ల్లిక‌ట్టు నేప‌ధ్యంలో త‌మిళ‌నాట కొన‌సాగుతున్న ప‌రిస్థితుల్ని గ‌మ‌నించి, ఇది విడుద‌ల‌కి స‌రియైన స‌మ‌యం కాద‌ని ఈ నిర్ణ‌యం తీసుకున్నామని నిర్మాత తెలిపారు. డైర‌క్ట‌ర్ హ‌రి , సూర్య గారి కాంబినేష‌న్ లో వ‌చ్చే చిత్రం కొసం తమిళ‌, తెలుగు ప్రేక్షుకులు ఏ విధంగా ఎదురుచూస్తుంటారో అంద‌రికి తెలిసిన విషయమే.కాని ప‌లు కార‌ణాల వ‌ల‌న ఈ చిత్రం విడుద‌లని ఎప్ప‌టిక‌ప్ప‌డు వాయిదా పడుతూ వస్తోంది. రెండు రాష్ట్రాల్లో అన్ని ప‌రిస్థితులు అనుకూలంగా వున్న టైంలో చిత్రాన్ని విడుద‌ల చేస్తామని నిర్మాత తెలిపారు.విడుదల తేదీ వివరాలను త్వరలోనే తెలియజేస్తామని తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు