90ఎంఎల్ ‘సింగిలు… సింగిలు’ సాంగ్ కి సూపర్ రెస్పాన్స్.

90ఎంఎల్ ‘సింగిలు… సింగిలు’ సాంగ్ కి సూపర్ రెస్పాన్స్.

Published on Nov 17, 2019 12:32 PM IST

యంగ్ హీరో కార్తికేయ లేటెస్ట్ మూవీ 90ఎంఎల్. యాన్ ఆథరైజ్డ్ డ్రింకర్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రంలో కార్తికేయ ఓ భిన్నమైన లవర్ గా కనిపించనున్నారని సమాచారం. ఈ చిత్రం నుండి నిన్న మూడవ సాంగ్ విడుదలైంది. ‘సింగిలు… సింగిలు’ అని సాగే ఈ సాంగ్ లో కార్తికేయ మరియు హీరోయిన్ నేహా సోలంకి ఎనర్జిటిక్ స్టెప్స్ తో ఇరగదీశారు. ముఖ్యంగా పోనీ టైల్, అల్ట్రా మోడరన్ డ్రెస్ లో కార్తికేయ లుక్ కేకగా ఉంది. చంద్రబోస్ రాసిన సాహిత్యానికి మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఫోక్ సాంగ్ తరహా స్వరాలు అందించారు.

ఇక బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను పాడటం విశేషం. ఎం ఎం మానస రాహుల్ తో కలిసి గొంతుకలిపారు. నిన్న విడుదలైన ఈ సాంగ్ యూత్ లో సూపర్ రెస్పాన్స్ అందుకుంది. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై, అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తుండగా, నూతన దర్శకుడు యెర్రా శేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతుంది. వచ్చే నెల 5న 90ఎంఎల్ మూవీ విడుదల కానుంది.

సాంగ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు