‘సైజ్ జీరో’లో నా రోల్ కథకు కీ పాయింట్ : సోనాల్ చౌహన్

‘సైజ్ జీరో’లో నా రోల్ కథకు కీ పాయింట్ : సోనాల్ చౌహన్

Published on Nov 26, 2015 7:00 PM IST

sonal-chohan1
‘సైజ్ జీరో’.. ఆర్య, అనుష్క ప్రధాన పాత్రల్లో నటించగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున రేపు (నవంబర్ 27న) విడుదల కానున్న సినిమా. ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను పీవీపీ సంస్థ నిర్మించింది. ఈ సినిమా కోసం 15కేజీలకు పైనే బరువు పెరిగి అనుష్క చేసిన సాహసం ‘సైజ్ జీరో’కు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇక అందుకు తగ్గట్లుగానే సైజ్ జీరో టీమ్ చేపట్టిన ప్రమోషన్స్‌ కూడా సినిమాపై అంచనాలు పెంచేశాయి.

ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమాలో ఆర్య, అనుష్కలతో పాటు మరో ప్రధాన పాత్రలో నటించిన సోనాల్ చౌహన్ ‘సైజ్ జీరో’ గురించి మాట్లాడారు. “సైజ్ జీరో సినిమాలో నేను సిమ్రాన్ అనే ఓ ఎన్నారైగా కనిపిస్తా. ఎన్నారై అంటే మన సినిమాల్లో ఒక సిగ్నేచర్ స్టైల్ ఉంటుంది. ఈ సినిమాలో అందుకు భిన్నమైన తరహాలో నా పాత్ర ఉంటుంది. ఆర్య, అనుష్క, సిమ్రాన్‌ల మధ్యన ట్రైయాంగిల్ స్టోరీ చాలా కొత్తగా ఉంటుంది. నా రోల్ కథకు కీలకంగా నిలుస్తుంది. ఇలాంటి సినిమాలో నటించే అవకాశం రావడం గర్వంగా ఉంది” అని తెలిపారు. లెజెండ్, పండగ చేస్కో లాంటి సినిమాలతో మెప్పించిన సోనాల్, త్వరలో బాలయ్య హీరోగా నటించిన డిక్టేటర్ సినిమాతోనూ మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు